రష్యాకు చెందిన లగ్జరీ బ్రాండ్ కేవియర్ కొత్త డిజైన్ తో రూ.5.8 లక్షలు విలువైన ఐ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఐఫోన్స్ కు మెకానికల్ వాచ్ ను జతచేసి అద్భుతమైన మోడళ్లను తయారు చేసింది. క్రిస్టల్ రక్షణతో డయల్ ను రూపొందించింది. ఐఫోన్ ఎక్స్ ఎస్, ఐఫోన్ ఎక్స్ మాక్స్ లిమిటెడ్ ఎడిషన్ కింద 99 ఐఫోన్లలను అందుబాటులోకి తెచ్చింది. ” సరికొత్త డిజైన్, వెనుక భాగంలో మెకానికల్ వాచ్ (టూర్బిలన్) తో కూడిన స్మార్ట్ ఫోన్ బాడీని రూపొందించి మా చరిత్రను కొనసాగిస్తున్నాం” అని కేవియర్ కంపెనీ తన వెబ్ సైట్ లో పేర్కొంది.
టూర్బిలన్ అనగా ఫ్రెంచ్ భాషలో వోర్టెక్స్ అని అర్థం. గ్రావిటీతో పని చేసే ఈ వాచ్ లో టైమ్ అక్యురేట్ గా ఉంటుందని, బ్లాక్ టైటానియం ప్యానెల్, గోల్డ్ ప్లేటెడ్ స్టోన్స్ వాటిలో ఇన్సర్ట్ చేసినట్లు కంపెనీ చెప్పింది. 64 జీబీ, 256 జీబీ, 512 జీబీ వేరియెంట్లలో ఐఫోన్ ఎస్ఎక్స్ ధర రూ.5.8 లక్షలు, రూ.6.01 లక్షలు, రూ.6.29 లక్షలుగా ఫిక్స్ చేసింది. 256 జీబీ ఐఫోన్ ఎక్స్ మాక్స్ మోడల్ ధర రూ.6.3 లక్షలు, 512 జీబీ ఐఫోన్ ఎక్స్ మాక్స్ ధర రూ.6.54 లక్షలుగా నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా రిటర్న్, రిఫండ్లతోపాటు షిప్పింగ్ గ్యారంటీ ఇస్తామని కంపెనీ చెప్పింది.