వరంగల్ లో లారీ ఓనర్ల ధర్నా

వరంగల్: ప్రభుత్వం పెంచిన ట్యాక్స్ లతో లారీలు నడపలేకపోతున్నామని, రైతు బంధు లాగా తమకు లారీ బంధు ఇవ్వాలని లారీ ఓనర్లు డిమాండ్ చేశారు. పెరిగిన ట్యాక్స్ లకు నిరసనగా నగరంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. లారీ ఓనర్లు, డ్రైవర్లు ఆర్టీవో కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం ట్యాక్స్ లు తగ్గించాలని ఆర్టీవో అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లారీ ఓనర్లు మాట్లాడుతూ... ప్రభుత్వం పెంచిన ట్యాక్స్ లతో లారీలు నడిపే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రీన్ ట్యాక్స్, ఫిట్ నెస్ పేరుతో భారీగా భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్న అప్పులకు వడ్డీ పెరుగుతోంని, ఫైనాన్సర్ల వేధింపులు పెరిగి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ట్యాక్స్ లు తగ్గించకుంటే ఆందోళనలు తీవ్ర తరం చేస్తామని లారీ ఓనర్లు, డ్రైవర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.