హైదరాబాద్లో ఆదివారం రాత్రి ఓయో రూంలో ఓ ప్రేమ జంట స్టే చేశారు. తెల్లవారే సరికి ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రామంతపూర్ ప్రగతి నగర్ లోని ఓ హోటల్లో సౌమ్య, ఓంకార్ ప్రేమికులు నవంబర్ 10న రూమ్ తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ప్రియుడు ఓంకార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఓంకార్ పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని హాస్పిటల్ కు తరలించారు. బేగంబజార్ కి చెందిన ఓంకార్ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగం చేస్తున్నాడు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.