- 10న శ్రీకాకుళం,ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం
- తీవ్రత పెద్దగా ఉండదంటున్న వాతావరణ శాఖ
దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది వాయవ్య దిశగా వేగంగా కదులుతూ తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపానుగా మారితే దీనికి ‘అసానీ’గా నామకరణం చేయనున్నారు. ఇది శ్రీకాకుళం, ఒడిశా తీరం మధ్య ఈ నెల 10వ తేదీన తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం అంత తీవ్రంగా ఉండదని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
ఇటు ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. మిగిలిన ప్రాంతాల్లో పలుచోట్ల ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు.
IMD warns cyclone Asani in Bay of Bengal to intensify into severe cyclonic storm in next 24 hours
— ANI Digital (@ani_digital) May 8, 2022
Read @ANI Story | https://t.co/C7hp1jDXhD#CycloneAsani #Cyclone #bayofbengal #IMDissuesWarning #OdishaCoastCyclone#IMD pic.twitter.com/1wVaDYShHN
మరిన్ని వార్తల కోసం..