తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ : బంగాళాఖాతంలో అల్పపీడనం అప్‌డేట్

ఉత్తర కోస్తాలో పలు ప్రాంతాల్లో మంగళవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో సెప్టెంబర్ 25, 26 ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీన పడింది. ఇక భారీ వర్షాల వచ్చే అవకాశం లేదని వాతావరణం శాఖ సెప్టెంబర్ 25న తెలిపింది. గత కొన్ని రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

ALSO READ | రైతులకు తీపి కబురు: త్వరలోనే రైతు భరోసా, పంట నష్ట పరిహారం

పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న అల్పపీడనం క్రమంగా బలహీన పడుతుందని IMD అధికారలు అంటున్నారు. దీంతో రాగల(సెప్టెంబర్ 26) 24 గంటల్లో కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీగా, అనేక చోట్ల మామూలుగా వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉందని వివరించారు.