మళ్లీ వస్తున్న మ్యాడ్ బాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’. గతేడాది విడుదలై విజయవంతమైన ‘మ్యాడ్’ చిత్రానికి ఇది సీక్వెల్.  కళ్యాణ్ శంకర్ దర్శకుడు.  సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.  కొన్ని నెలల క్రితం ఈ సినిమాను ప్రకటించిన దర్శకనిర్మాతలు.. తాజాగా మొదటి పాటకు సంబంధించిన అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ ఇచ్చారు.  

ఈనెల 20న ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హీరోలు ముగ్గురు ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించారు. ఫస్ట్ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరహాలోనే మరో చార్ట్ బస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటలను మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో రెడీ చేస్తున్నారని,  అలాగే రెట్టింపు వినోదం ఇందులో ఉండబోతోందని నిర్మాతలు తెలియజేశారు.