నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్ల మాయాజాలం బయటపడింది. 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాయం చేసినట్టు తెలుస్తోంది. FCI తనిఖీల్లో మిల్లర్ల అవినీతి భాగోతం బయటపడింది. జిల్లా వ్యాప్తంగా 300 రైస్ మిల్లులు ఉంటే..60 రైస్ మిల్లుల్లో బియ్యం మాయమైనట్టు గుర్తించినట్టు సమాచారం. బోధన్ మండలం సాలూరు క్యాంప్ లోని శివశక్తి రైస్ మిల్లులోనే 38 వేల క్వింటాళ్ల ధాన్యం గోల్ మాల్ జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ బియ్యం విలువ సుమారు రూ.7 కోట్ల 50 లక్షలు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో సుమారు 100 కోట్లకుపైగా బియ్యం స్కామ్ జరిగినట్లు లెక్కలేస్తున్నారు అధికారులు.
మరిన్ని వార్తల కోసం
రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు