
ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్ నేషన్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ 1990 నుంచి మానవాభివృద్ధి సూచీ(హెచ్‌డీఐ)ను రూపొందించి ప్రపంచ దేశాల్లో మానవాభివృద్ది స్థాయిలను తెలిపే నివేదికను ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్నది. దేశానికి నిజమైన సంపద ఆ దేశంలోని ప్రజలే. ప్రజల స్వేచ్ఛ, ఎంపికలను విస్తృతపరచడమే ఆర్థికాభివృద్ధి ముఖ్య లక్ష్యం. ప్రజల ఎంపికలను విస్తృతం చేయడంతోపాటు ప్రజా శ్రేయస్సును పెంపొందించే క్రమం మానవాభివృద్ధి అని మహబూబ్ ఉల్ హక్ నిర్వచించారు. 1990లో మానవ అభవృద్ధి సూచీని రూపొందించారు. ఈ ఇండెక్స్ రూపకల్పనలో మహబూబ్ ఉల్ హక్, రిచర్జ్ జాలీ, గుస్తావ్ రానీష్, మేఘనాథ్ దేశాయ్, సంక్షేమ ఆర్థికవేత్త అమర్త్యసేన్ల కృషి ఎంతో ఉంది. అయినా హెచ్‌డీఐ రూపశిల్పిగా మహబూబ్ ఉల్ హక్‌ని పేర్కొంటారు.
హెచ్డీఆర్ -2021
2021 హ్యుమన్ డెవలప్మెంట్ రిపోర్ట్‌ను 2022 సెప్టెంబర్‌లో ప్రకటించారు. 191 దేశాలకు హెచ్‌డీఐని ప్రకటించారు. దీనిని ప్రపంచ దేశాలను నాలుగు రకాలుగా విభజించారు.
1. Very High Human developed countries (0.800 నుంచి 1.000) 1–66 దేశాలు
2. High Human development countries (0.703 నుంచి 0.796) 67–- 115 దేశాలు
3. Medium Human development countries (0.550 నుంచి 0.699) 116– 159 దేశాలు
4. Low Human development countries (0.00 నుంచి 0.549) 160 – 191 దేశాలు
- బ్రిక్స్ దేశాల్లో తక్కువ హెచ్‌డీఐ కలిగిన దేశం: భారత్
- తొలి 10 స్థానాల్లో ఉన్న దేశాల్లో ఆసియా ఖండ దేశం హాంగ్‌కాంగ్
- శ్రీలంక, చైనా, మాల్దీవులు, భూటాన్, బంగ్లాదేశ్ మన దేశం కంటే మానవాభివృద్ధిలో ముందున్నాయి.
- భారత్ మానవాభివృద్ధిలో మధ్యస్థాయి మానవాభివృద్ధి దేశాల స్థాయిలో ఉంది.
బ్రిక్స్ దేశాలు
52 – రష్యా : (0.822)
87 – బ్రెజిల్: (0.754)
79 – చైనా: (0.768)
109– సౌత్ ఆఫ్రికా: (0.713)
132 – ఇండియా: (0.633)
ర్యాంకు దేశం హెచ్‌డీఐ విలువ
1 స్విట్జర్లాండ్ (0.962)
2 నార్వే (0.961)
3 ఐస్లాండ్ (0.959)
4 హంగ్‌కాంగ్ (0.952)
5 ఆస్ట్రేలియా (0.951)
6 డెన్మార్క్ (0.948)
6 స్వీడన్ (0.948)
8 ఐర్లాండ్ (0.945)
9 జర్మనీ (0.942)
10 నెదర్లాండ్స్ (0.941)
చివరి ఐదు దేశాలు
191 దక్షిణ సూడాన్ (0.385)
190 చాద్ (0.394)
189 నైగర్ (0.400)
188 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (0.404)
187 మాలి (0.428)
భారత్ పొరుగు దేశాలు
73 శ్రీలంక (0.782)
79 చైనా (0.768)
90 మాల్దీవులు (0.747)
127 భూటాన్ (0.666)
129 బంగ్లాదేశ్ (0.661)
143 నేపాల్ (0.602)
149 మయన్మార్ (0.586)
161 పాకిస్తాన్ (0.544)
180 ఆప్గనిస్తాన్ (0.478)