ఇండియన్ రైల్వేస్‌ది ప్రపంచంలోనే 4వ అతి పెద్ద నెట్వర్క్. సరుకు రవాణాలో పనితీరు ఆ రేంజ్లో ఉండడం లేదు. నేషనల్ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్‌లో రైల్వేల వాటా 20 శాతమే. ఈ షేర్‌ను 45 శాతానికి పెంచుతామని మన దేశం ప్రపంచ వేదికలపై హామీ ఇచ్చింది. ఆ మాటను నిలబెట్టుకోవటానికి ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ ఏడాది గూడ్స్ రాబడిలో నెలకొన్న లోటును పూడ్చటానికి ఫాస్ట్‌గా కదులుతోంది. మొత్తం సరుకు రవాణా విధానాన్నే మార్చనుంది. గూడ్స్ బండ్లకు సరికొత్త బోగీలను రూపొందించనుంది.
మన దేశంలో రైల్వే రంగానికి సరుకు రవాణే ముఖ్య ఆదాయ మార్గం. గూడ్స్ రవాణా ద్వారా వచ్చే మొత్తం రాబడిలో మేజర్ షేరు (44 శాతం) బొగ్గుదే. ఆ తర్వాతి స్థానాల్లో సిమెంట్ (8 శాతం), ముడి ఇనుము (8 శాతం), తిండి గింజలు (7 శాతం) ఉన్నాయి. ఈ సరుకును రైల్వేలు పెద్ద మొత్తంలో (బల్క్‌గా) తరలిస్తుంటాయి. ఈ పాలసీ ఎప్పటినుంచో అమలవుతోంది. కానీ.. ఈ విధానం సరికాదని, ఇతర మెటీరియల్స్ రవాణాకీ రైళ్లలో చోటివ్వాలని ఇటీవల నిర్ణయించారు. కొన్ని సరుకులు గూడ్స్‌కే పరిమితమవటం వల్ల ఆశించినంత ఆదాయం రావట్లేదని గుర్తించారు.
రెవెన్యూ టార్గెట్ రీచ్ కాలే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019–20)లో మొత్తం 1,216 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయాలని, తద్వారా లక్షా 43 వేల కోట్ల రూపాయల ఆదాయం రాబట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే, ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో రూ.71,800.20 కోట్లు మాత్రమే వచ్చాయి. రూ.17,641.91 కోట్ల లోటు ఏర్పడింది. ఈ లోటు అక్టోబర్ చివరలో రూ.14,882.72 కోట్ల వద్దే ఉండగా నవంబర్ ఆఖరికి మరింత పెరిగింది. ఈ ఇన్‌కం గ్యాప్ ఇంకా పెద్దది కాకుండా చూడటానికి వెంటనే చర్యలు చేపట్టారు.
బోగీల డిజైన్ మార్చాలి
బల్క్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వల్ల అంచనాలకు తగ్గట్లు ఆదాయం రాకపోవటంతో నాన్–బల్క్ ఐటమ్స్ తరలింపునకూ రెడీ కావాలనే క్లారిటీకి వచ్చేశారు. అయితే నాన్–బల్క్ కమోడిటీలను రవాణా చేయాలంటే ఇప్పుడున్న వ్యాగన్లు అనుకూలం కాదని, వాటికి బదులు కొత్త డిజైన్‌తో బోగీలు తయారుచేయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం టోటల్ రైల్ ట్రాఫిక్‌లో నాన్–బల్క్ ఐటమ్స్ వాటా దాదాపు 30 శాతం. ఇందులో ఒక్కో సెక్షన్ (కమోడిటీ) షేరు 10 శాతం కన్నా తక్కువే ఉంటుందంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఎన్డీసీని పెంచాల్సిన పరిస్థితి
ప్రపంచ వేదికలపై మన దేశం కమిట్ అయిన అంశాలను బట్టి చూస్తే ‘నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ (ఎన్డీసీ)’ని పెంచాల్సిన అవసరం ఏర్పడింది. దీనికోసం నేషనల్ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్‌లో రైల్వేల వాటాను ప్రస్తుతం ఉన్న 20 శాతం నుంచి సుమారు 45 శాతానికి చేర్చాలి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో నాన్–బల్క్ కమోడిటీ సెగ్మెంట్లో బిలియన్ టన్నుల రవాణా జరగాలంటే ఫ్రీట్ ట్రాఫిక్ మూమెంట్‌కు తెర తీయాలి. ఇది మొత్తం దేశానికి, రైల్వేలకు, ఎన్విరాన్మెంట్ సెక్టార్‌కే సవాల్ లాంటిదని రైల్వే మినిస్ట్రీ ఆఫీషియల్స్ అంటున్నారు.
కొత్త కమోడిటీలపై ఫోకస్
ఇండియన్ రైల్వే ఇన్నాళ్లూ ఐరన్ ఓర్, కోల్, సిమెంట్, ఫుడ్ గ్రెయిన్స్ వంటి ట్రెడిషనల్ ఐటమ్స్ రవాణానే పట్టించుకుంది. ఇకపై ఫ్లైయాష్, ఫినిష్డ్ స్టీల్ (స్టీల్ కాయిల్స్), ఆటోమొబైల్స్, కంటెయినర్స్, ఎఫ్ఎంసీజీ తదితర కొత్త కమోడిటీలపైనా ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. స్టీల్ ప్లాంట్లు, పవర్, ఐరన్ ఇండస్ట్రీలకు కావాల్సిన ముడి సరుకు తెచ్చివ్వడం, అక్కడి ఫైనల్ ప్రొడక్ట్స్‌ని రవాణా చేయడాన్ని కొత్త టార్గెట్‌లో చేర్చింది. దీనిద్వారా సరుకు రవాణాలో వస్తున్న రాబడి లోటును భారీగా తగ్గించాలని తీర్మానించుకుంది. కొత్త కమోడిటీలతో కనీసం రూ.25 వేల కోట్లు గడించాలని అనుకుంటోంది.
కరెక్షన్ కచ్చితంగా అవసరమే
ప్రస్తుతం రైల్వే రంగంలో నెలకొన్న పరిణామాలు ఒక రకంగా ప్రమాద హెచ్చరికను మోగిస్తున్నాయి. భవిష్యత్‌లో బిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేరడానికి నాన్–బల్క్ కమోడిటీ సెక్షన్లో లాజిక్ సర్వీస్ ప్రొవైడర్స్‌కి ఎంతో స్కోప్ ఉంది. దాన్ని వాళ్లు ఉపయోగించుకోవాలి. టోటల్ ఫ్రీట్ మూమెంట్లో 45 శాతం రైల్వేల ద్వారానే జరగాలి. అదే ఇప్పుడు అందరి ముందున్న మెయిన్ ఎయిమ్. డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్లు ఒక్కసారి పట్టాలెక్కితే మన రైల్వేలకు తిరుగుండదు. ‑ రాజేశ్ అగ్రవాల్, రైల్వే బోర్డ్ మెంబర్ రోలింగ్ స్టాక్ (ఎంఆర్ఎస్)