సర్పంచ్ ల సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రణీల్ చందర్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతను ఈఈఎస్ఎల్ కంపెనీకి ఇచ్చేలా తీర్మానాలు చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని రాష్ట్ర సర్పంచ్ ల సంఘం ప్రధాన కార్యదర్శి పాలకొండ ప్రణీల్ చందర్ ఆరోపించారు. ఈ తీర్మానాలు ఇవ్వకపోతే బిల్లులు ఆపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. జిల్లా ట్రెజరీ ఆఫీస్ లో కలెక్టర్లు బిల్లులు ఆపేశారన్నారు. ఈ విషయమై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సర్పంచ్ సంఘం నేతలు శనివారం వినతిపత్రం అందజేశారు. తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈఈఎస్ఎల్ సంస్థ సకాలంలో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయకపోతే సర్పంచ్ లపై ప్రజలు ఒత్తిడి తెస్తారని ప్రణీల్ చందర్ చెప్పారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ తో చర్చించి స్ట్రీట్ లైట్ల నిర్వహణ పంచాయతీలకే ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని మంత్రికి ఇచ్చిన లెటర్ లో పేర్కొన్నట్టు తెలిపారు. సమావేశంలో ముంత యాదన్న యాదవ్ తోపాటు పలువురు సర్పంచ్ లు పాల్గొన్నారు.
For More News..