
నవాబుపేట, వెలుగు : జేబులో సెల్ఫోన్ పేలడంతో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. మండలంలోని యన్మన్గండ్ల గ్రామానికి చెందిన మిజ్బాహుద్దీన్ గురువారం బక్రీద్ సందర్భంగా ప్రార్థన చేసుకొని ఇంటికి వస్తుండగా, జేబులో ఉన్న రెడ్మీ ఫోన్ నుంచి మంట, పొగలు వచ్చాయి. పక్కనే ఉన్న వారు గమనించి జేబులో నుంచి సెల్ఫోన్ తీసి పడేశారు. కింద పడ్డ వెంటనే పెద్ద శబ్దంతో సెల్ఫోన్ పేలిపోయింది. జేబు వద్ద బట్టలు కాలడంతో స్వల్ప గాయాలయ్యాయి. కంపెనీపై ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు తెలిపారు.