మాంజా దారం గొంతు కోసింది!

మాంజా దారం గొంతు కోసింది!
  • భద్రాద్రి జిల్లా కొత్తగూడెం  టౌన్ లో ఘటన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పతంగి మాంజా గొంతుకు కోసుకుని వ్యక్తి సీరియస్  అయ్యాడు. ఈ ఘటన భద్రాద్రి జిల్లాలో జరిగింది.  చండ్రుగొండ మండలం గుర్రాయిగూడెం గ్రామానికి చెందిన ఏరువ కృష్ణారావు కొత్తగూడెం టౌన్ లో ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు.

బుధవారం అతడు బైక్​పై డ్యూటీకి వెళ్తుండగా.. కొత్తగూడెం టౌన్ రామవరం ఏరియాలో పతంగి మాంజా మెడకు తగలడంతో గొంతు కోసుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమై కింద పడిన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైనట్రీట్ మెంట్ కోసం ఖమ్మం పంపించారు.  అక్కడ్నుంచి అతడిని కుటుంబసభ్యులు హైదరాబాద్ తీసుకెళ్లారు.