ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కార్యాలయంలో సమావేశం ముగిసింది. కేంద్ర హోంశాఖ సెంటర్ స్టేట్ రిలేషన్స్ విభాగం జాయింట్ సెక్రెటరీ పార్థసారథి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఏపీ భవన్ విభజనపై తమ ప్రతిపాదనలను కేంద్ర హోంశాఖకు అందజేశారు ఏపీ, తెలంగాణ అధికారులు.
అయితే విభజనపై ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఏపీ ప్రతిపాదనకు తెలంగాణు ససేమిరా అనడంతో విభజనపై ఎటూ తేలకుండానే సమావేశం ముగిసింది. వారం రోజుల్లో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు ఇరు రాష్ట్రాల అధికారులు.
రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లయినా ఏపీ భవన్ లోనే సమావేశాలు జరిగాయి. సుమారు 20 ఎకరాలలో ఉన్న ఏపీ భవన్ ను జనాభా ప్రతిపాదికన విభజించాల్సి ఉంటుంది. ఇతర ఆస్తులను కూడా ఈవిధంగానే విభజించారు. జనాభా ప్రతిపాదికన అంటే ఏపీ వాటాగా 58.32 శాతం అంటే 11.32 ఎకరాలు తెలంగాణకు 41.68 శాతం అంటే 8.41 ఎకరాలు పైగా వస్తుంది. అయితే ఇందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. దీంతో మరోసారి సమావేశం కావాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది.