కేటీఆర్​ను కలిసిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య

యాదాద్రి, వెలుగు : ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య పుట్టిన రోజు సందర్భంగా గురువారం మంత్రి కేటీఆర్​ను సెక్రటేరియట్​లో కలిశారు. ఈ సందర్భంగా భిక్షమయ్యతో మంత్రి కేటీఆర్​ మాట్లాడారు. యాదాద్రి జిల్లాతో ఆలేరు నియోజకవర్గం తాజా రాజకీయ పరిస్థితులను ఆయన ఆరా తీశారు. ఇచ్చిన మాట నిలబట్టుకుంటామని, కచ్చితంగా అవకాశమిస్తామని భిక్షమయ్యకు మంత్రి కేటీఆర్​ చెప్పారు. మరోవైపు ఉప్పల్​లోని భిక్షమయ్య ఇంటికి ఆలేరు నియోజకవర్గం నుంచి బీఆర్​ఎస్​ శ్రేణులు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆలేరులో చర్చ మొదలైంది.

మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో భిక్షమయ్య గౌడ్​ను సీఎం కేసీఆర్​ ప్రగతి భవన్​కు పిలిపించుకొని మాట్లాడిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది. తాజాగా ఆయన మంత్రి కేటీఆర్​ఎను కలవడం, బీఆర్​ఎస్​ నాయకులు ఆయనను కలవడం మరోసారి చర్చకు దారి తీస్తోంది.