మహబూబాబాద్ జిల్లా: ‘‘మంత్రి సత్యవతి రాథోడ్ కొడుకు జీతం కోసం నన్ను బలిపశువును చేశారంటూ మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెడెంట్ డాక్టర్ భీమ్ సాగర్ కంటతడిపెట్టారు. మంత్రి నన్ను టార్గెట్ చేసింది. మానసికంగా వేధించింది. నా రిటైర్మెంట్ కు ఇంకా 16 నెలలుంది. అయినా సరే అకారణంగా నన్ను బదిలీ చేయించింది..’’ అటూ మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిసూపరిండెంట్ డాక్టర్ భీం సాగర్ కంటతడిపెట్టారు. హఠాత్తుగా బదిలీ ఉత్తర్వులు అందుకున్న ఆయన తీవ్ర మనస్తాపంతో కన్నీరుమున్నీరయ్యారు. ‘‘మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో సుదీర్ఘంగా పనిచేశాను.. మాజీ మంత్రి రెడ్యానాయక్, ఎంపీ మాలోత్ కవిత, శంకర్ నాయక్ , కలెక్టర్ లు నాకు సహాయ సహకారాలు అందించారు. అందరికీ నా కృతజ్ఞతలు. ఆసుపత్రి అభివృద్ధికి కలెక్టర్ల సహకారంతో ఎనలేని కృషి చేస్తున్న నన్ను మంత్రి సత్యవతి రాథోడ్ టార్గెట్ చేసి మానసికంగా వేధించారు..’’ అని ఆరోపించారు. ఛాతీ వైద్య నిపుణుడైన మంత్రి కుమారుడు నెలలో వారం రోజుల మాత్రమే డ్యూటీ కి వస్తాడు. అయినా సరే నెల రోజుల జీతం ఇవ్వాలని అధికారులపై వత్తిడి తెస్తాడు. అలా ఇవ్వకపోవడంతోనే నన్ను టార్గెట్ చేశారని కంటతడిపెట్టారు.
సూపరింటెడెంట్ పదవి వొద్దు.. డాక్టర్ గా పనిచేస్తానన్నా వినలేదు
నేను అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా. నాకు సూపరిండెంట్ పదవి వద్దు. డాక్టర్ గా పనిచేస్తానన్నా నాకు అవకాశం ఇవ్వలేదు. ప్రమోషన్ ఇచ్చినా సంతోష పడేవాడిని, ప్రమోషన్ ఇవ్వకుండా కేవలం డిప్యుటేషన్ పై హైదరాబాద్ పంపించారని వాపోయారు. ‘‘పని హైదరాబాద్ లో చేయాలి, జీతం మాత్రం మహబూబాబాద్‌లో తీసుకోవాలట.. ఏ తప్పు చేయకున్నా నన్ను అకారణంగా శిక్షించారు. సీబీఐ, సీబీసీఐడి విచారణకైనా నేను సిద్ధం..’’ అన్నారు.
For More News..
కేసీఆర్‌పై బాహుబలి రేంజ్లో డాక్యుమెంటరీ
ఎన్జీటీ వద్దన్నా.. ఏపీ సంగమేశ్వరం పనులు చేస్తోంది
డిప్రెషన్‌లో చాలా రకాలున్నయ్.. లైఫ్ స్టైల్, మనస్తత్వాన్ని బట్టి లక్షణాలు
లోడ్ చార్జీల పేర ట్రాన్స్‌కో వడ్డింపులు