థాయిలాండ్లో ఉద్యోగాలు ఇప్పిస్తామనే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ స్టూడెంట్స్కు భారత విదేశీ వవ్యహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. డిజిటల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్‌గా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొన్ని ఐటీ సంస్థలు విద్యార్థులను నమ్మిస్తున్నాయని..వాటితో జాగ్రత్తగా ఉండాలని అడ్వైజరీ వెలువరించింది. భారతీయ విద్యార్థులే టార్గెట్గా కొందరు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది.
బ్యాంకాక్, మయన్మార్‌లో నిఘా
ఐటీ ఉద్యోగాల పేరిట నకిలీ జాబ్ రాకెట్ల దందాకు సంబంధించి భారత విదేశీ వవ్యహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో మయన్మార్‌లో చిక్కుకున్న భారతీయుల వీడియో బహిర్గతమైన నేపథ్యంలో ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం.. గతంలో కాల్ స్కామ్స్, క్రిప్టో కరెన్స్ ఫ్రాడ్స్ చేసిన IT సంస్థలే ..ప్రస్తుతం జాబ్ ఫ్రాడ్‌కు పాల్పడుతున్నాయని తెలిపింది. బ్యాంకాక్, మయన్మార్‌లో ప్రత్యేక నిఘా ద్వారా వీటిని నిర్థారించినట్లు స్పష్టం చేసింది.
ఉద్యోగం పేరు చెప్పి బార్డర్ దాటించేస్తున్నారు...
ఫేక్ జాబ్ రాకెట్స్..ఐటీ స్కిల్స్ ఉన్న వారినే టార్గెట్ చేస్తున్నారని..విదేశాంగ శాఖ ప్రతినిధి అరింద్ బాగ్చీ తెలిపారు. డేటా ఎంట్రీ జాబ్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో దుబాయ్, ఇండియాలోని ఏజెంట్‌లు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దీనికి సంబంధించిన అడ్వైజరీని షేర్ చేశారు. ఉద్యోగం పేరుతో అక్రమంగా దేశం దాటిస్తున్నారని..ఆ తర్వాత అక్కడ దారుణమైన పరిస్థితుల్లో పని చేయించుకుంటున్నారని వెల్లడించారు. జాబ్ ఆఫర్ వస్తే కంపెనీ వివరాలు కచ్చితంగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఇండియన్ స్టూడెంట్స్ ఫేక్ జాబ్ రాకెట్ ట్రాప్లో చిక్కుకోవద్దని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ యాడ్‌లకు స్పందించవద్దన్నారు.