ఈ వీడియో చూసి తీరాల్సిందే.. ఆకాశంలో అద్భుతం...అసలైన ఉల్కాపాతం అంటే ఇదే

ఆకాశంలో అప్పుడప్పుడు అద్భుతాలు చోటుచేసుకుంటాయి. తాజాగా స్పెయిన్, పోర్చుగల్‌లోని ఓ ప్రాంతంలో ఆకాశంలో ఓ పెద్ద వెలుగు దర్శనం ఇచ్చింది. వందల కిలోమీటర్ల వరకు ఆ వెలుగు కనిపించినట్లు స్థానికులు చెప్పారు. అయితే ఆ వెలుగు ఏంటని ముందు అందరూ ఆశ్చర్యానికి లోనైనా త్వరగానే అదేంటో కనిపెట్టారు. ఆకాశం నుంచి భారీ సైజులో ఉల్క నెలపై పడింది. దానికి సంబంధించిన వెలుగు అని నిపుణులు చెబుతున్నారు.

ఉల్కాపాతం.. చాలా మంది ఈ పేరు విని ఉంటారు. ఆకాశం నుంచి ప్రకాశవంతంగా దూసుకొస్తూ భూమి మీద పడే సమయంలో ఇవి అద్భుతంగా కనిపిస్తాయి. అయితే శనివారం ( మే 18)  ఇలాంటి సంఘటనను స్పెయిన్ , పోర్చుగల్ దేశాల ప్రజలు చూసి అనుభూతిని పొందారు. మొదట ఉల్క భూమిపైకి వస్తున్న సమయంలో దానిని చూసిన వారు సూపర్ పవర్ ఏమైనా భూమి మీదకు దూసుకువస్తుందా? అని అనుకున్నారట. ఉల్కాపాతం గురించి వినడమే కాని చూసిన వారు చాలా తక్కువ. ఈ దృశ్యాలు చూసిన వారిలో కొందరు ఏలియన్ల పనేనా? అంటూ ఆశ్చర్యపోయారట. స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో ప్రజలు ఓ అద్భుతమైన దృశ్యాన్ని చూశారు. నీలి రంగులో మెరుస్తూ ఉల్క ఒకటి భూమి మీదకు దూసుకువచ్చింది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోడ్డుపై వెళ్లే వారితో పాటు, వివిధ ప్రాంతాల్లో పార్టీలు జరుపుకుంటున్న వారు ఈ దృశ్యాలను తమ కెమరాల్లో బంధించారు

అయితేఈ ఉల్క ఎక్కడ పడింది అనే దానిపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడ లేదు. ఇదిలా ఉంటే రెండు వారాల క్రితమే అక్కడి ఖగోళ శాస్త్రవేత్తలు ఉల్క పడవచ్చని అంచనా వేసారు. అయితే మరి కొన్ని సార్లు హేలీ తోక చుక్క నుంచి వెలువడే శకలాల కారణంగా ఉల్కాపాతం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.అయిదే ఆ ఉల్క ఎక్కడ పడిందో ఎవరు కూడా కచ్చితంగా చెప్పలేక పోతున్నారు. కానీ క్యాస్ట్రో డైరో ప్రాంతంలో అది పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటి జనులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల  ప్రకారం, ఉల్కాపాతం రంగు గ్రహశకలాల్లోని రసాయనాలను బట్టి ఉంటుంది. పోర్చుగల్, స్పెయిన్‌లోని ఉల్కల్లో మెగ్నీషియం అధికంగా ఉండటంతో అవి ఆకుపచ్చ రంగు కాంతి వెదజల్లుతూ మండాయని నిపుణులు చెబుతున్నారు. కాల్షియం అధికంగా ఉన్న ఉల్కలు వయలెట్, సోడియం అధికంగా ఉంటే నారింజ రంగు, ఐరన్ అధికంగా ఉంటే పసుపు పచ్చ రంగులో మండుతాయని పేర్కొన్నారు. ఇక ఉల్కలు వాతావరణంలో ప్రవేశించే వేగాన్ని బట్టి కూడా రంగులో తీవ్రత ఆధారపడుతుందని చెబుతున్నారు.