ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ధ్యేయం

ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ధ్యేయం

అచ్చంపేట/మిడ్జిల్/అయిజ, వెలుగు:  దేశ ప్రజలపై తీవ్రమైన పన్నుల భారాన్ని మోపుతన్న బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు ప్రజలను ఏకం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్​జాతీయ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర చేపట్టారని పీసీసీ వైస్​ప్రెసిడెంట్​డాక్టర్​ మల్లురవి, నాగర్​కర్నూల్​డీసీసీ ప్రెసిడెంట్​డాక్టర్​ వంశీకృష్ణ అన్నారు. రాహుల్​ గాందీ యాత్రకు మద్దతుగా డాక్టర్​ వంశీ కృష్ణ అచ్చంపేట మండలంలోని ఉమామహేశ్వర ఆలయం నుంచి అచ్చంపేట వరకు పాదయాత్ర నిర్వహించారు. యాత్ర అచ్చంపేట దగ్గరకు రాగానే వంశీకృష్ణ సొమ్మసిల్లి పడిపోయారు. ఆయనను వెంటనే అచ్చంపేటలోని  ఓ ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించారు. గోపాల్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

జడ్చర్లలో..

భారత్ జోడో యాత్రకు మద్దతుగా జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అనిరుద్ రెడ్డి మిడ్జిల్ నుంచి జడ్చర్ల వరకు గురువారం 20 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. మండల కేంద్రంలో ప్రారంభమైన పాదయాత్ర సాయంత్రానికి జడ్చర్ల చేరుకున్నారు. ఈ పాదయాత్రకు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి సంఘీభావం తెలిపారు.  ఈ పాదయాత్రలో మిడ్జిల్ ఎంపీపీ కాంతమ్మ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.  

ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ధ్యేయం

ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని గద్వాల డీసీసీ ప్రెసిడెంట్ సులోచన అన్నారు.  రాహుల్​గాంధీ చేపట్టిన జోడో  యాత్రకు మద్దతుగా గురువారం పార్టీ శ్రేణులతో కలిసి అయిజ మండల కేంద్రం నుంచి ఉత్తనూర్, మూగోని పల్లె వరకు15 కిలోమీటర్లు పాద యాత్ర చేశారు. ఆమె వెంట కాంగ్రెస్ లీడర్లు గిత్తల దేవరాజు పాల్గొన్నారు.