పుట్ట మధు బుల్లెట్.. భారీ మెజార్టీతో గెలిపించాలి : ఎమ్మెల్సీ కవిత

పుట్ట మధు బుల్లెట్.. భారీ మెజార్టీతో గెలిపించాలి : ఎమ్మెల్సీ కవిత

మంథని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఎవరికి ఏం పని చేశాడో ప్రజలందరూ ఆలోచించాలన్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రభుత్వం లేదని చెప్పే నాయకుడికి ఓట్లు వేస్తే ఏం లాభమన్నారు. మంథని నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి దత్తత తీసుకునేలా వెయ్యి కోట్లు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడున్న రెండువేల పెన్షన్ ను క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్తామన్నారు. జయశంకర్ జిల్లా కాటారంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

పెండింగ్ రేషన్ కార్డులను విడుదల చేస్తామని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. ఆధారం లేని కుటుంబాలకు సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా మూడు వేలు ఇస్తామన్నారు. ఇంటి పెద్ద కోల్పోతే కేసీఆర్ రక్ష పథకం ద్వారా రూ.5 లక్షల బీమా పథకం అమలు చేస్తామన్నారు. మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు బుల్లెట్.. ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలి అంటూ ఓటర్లను అభ్యర్థించారు. 

కాంగ్రెస్ పార్టీ మంథని నియోజక వర్గ నాయకులకు ఎలాంటి గౌరవం ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరంట్ ఇచ్చిందని చెప్పారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్న బియ్యం ఇచ్చే విధంగా చేస్తామన్నారు. మంథని ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన పుట్ట మధును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.