మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వరంగల్ రూరల్ జిల్లా: మహిళల దగ్గర ఉండే డబ్బు ఎన్నటికీ వృధా కాదు .. ఐకేపీ సంఘాల ద్వారా ఇచ్చిన రుణాలతో మహిళలు ఏదయినా వస్తువుల తయారీని ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. మహిళలు ఉత్పత్తి చేస్తే ఏదైనా సరే నాణ్యత ఉంటుందని.. నాణ్యత ఉండే వస్తువులకు మార్కెట్లో మంచి గిరాకీ ఎప్పుడూ ఉంటుందన్నారు. చెన్నారావు పేట మండలంలో అక్షయ రైతు ఉత్పత్తి దారుల సమాఖ్యకు వ్యవసాయోపకర యంత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కేసీఆర్ గారి దయ వల్ల రుణ మాఫీ అయ్యింది .. ఐకేపీ సంఘాల వల్ల మహిళలకు గౌరవం దక్కింది.. మహిళలు కూడా పరిశ్రమలను స్థాపించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి గ్రామనికి మహిళా రైతు సంఘం ఏర్పాటు కావాలి.. మహిళలు 100 శాతం రుణాలను చెల్లిస్తారు.. కాబట్టి చెన్నారావుపేట్ లో ఇండస్ట్రీ … ఏర్పాటుకు అన్ని రకాల సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. మన తెలంగాణలో అన్ని రకాల పరిశ్రమలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది.. స్వయం ఉపాధి కల్పన, పరిశ్రమల ఏర్పాటుపైన యువత ఆసక్తి చూపించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.