కూకట్పల్లి, వెలుగు : కొడుకు సరిగా చదవకుండా జులాయిగా తిరుగుతున్నాడనే ఆవేదనతో తల్లి సూసైడ్ చేసుకుంది. హైదరాబాద్ సిటీ బాలానగర్ పరిధిలోని రాజుకాలనీలో నివసించే పుష్పలత(39) ఈఎస్ఐ ఆసుపత్రిలో హౌస్ కీపింగ్ పని చేస్తోంది. ఇంటర్ చేస్తున్న రెండో కొడుకు సరిగా చదవకుండా ఆకతాయిలతో కలిసి తిరుగుతున్నాడు. వీరి కుటుంబానికి కొన్ని అప్పులు కూడా ఉన్నాయి.
అప్పులు, కొడుకు విషయంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. తల్లి నచ్చజెప్పినా కొడుకు వినకపోవడంతో మనస్తాపానికి గురై సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయింది. ఈ మేరకు బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.