బోధన్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ సాధించేవరకు ఉద్యమం ఆగదని టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గుండారం మోహన్ పేర్కొన్నారు. బుధవారం బోధన్‌లోని పార్టీ ఆఫీస్‌లో ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. మోహన్ మాట్లడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 28 ఏండ్లుగా పోరాటం సాగుతుందని, రాజకీయ పార్టీలు మాదిగలను ఓటు బ్యాంక్‌గా వాడుకుంటున్నారే తప్ప తమ ఆకాంక్షను నెరవేర్చడం లేదన్నారు.
వచ్చే పార్లమెంట్సమావేశంలో ఎస్సీవర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 29న టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సభను విజయవంతం చేయాలని కోరారు. లీడర్లు బద్ధం లింగన్న, ఏ.మారయ్య, ఎమ్.సుధాకర్, పోసాని, వి.నాగురావ్, పోశెట్టి పాల్గొన్నారు.