అలనాటి మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. టైటిల్ పాత్రలో సింగర్ కృష్ణ చైతన్య, ఆయన భార్య సావిత్రి పాత్రలో మృదుల నటిస్తున్నారు. సి.హెచ్.రామారావు దర్శకత్వంలో ఫణి, జి.వి భాస్కర్ నిర్మిస్తున్నారు. డిసెంబర్‌లో సినిమా విడుదల కానున్న సందర్భంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ ‘ఘంటసాల లాంటి గొప్ప వ్యక్తి కథతో సినిమా తీయడం అభినందనీయం.
ఆయనపై మనకున్న అభిమానాన్ని చూపించాలంటే ఈ సినిమాను సూపర్‌హిట్ చేయాలని ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ప్రేక్షకులను కోరుతున్నా’ అన్నారు. కృష్ణచైతన్య మాట్లాడుతూ ‘ఘంటసాల గారి పాత్ర పోషించడం గాయకుడిగా నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా’ అని అన్నారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అని దర్శక నిర్మాతలు చెప్పారు.