ఓటీటీలో విడుదలకు సిద్ధమైన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’

ఓటీటీలో విడుదలకు సిద్ధమైన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’

అల్లరి నరేశ్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 25న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. సినిమా ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకున్న జీ5, క్రిస్మస్ కానుకగా ఈ నెల 23 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.  ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కింది. 

రాజకీయ వ్యవస్థను ప్రశ్నించడం అనే కాన్సెప్ట్‌తో చిత్రించిన ఈ సినిమాలో ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా అల్లరి నరేష్ అద్భుత నటనను కనబరిచాడు. మారేడుమిల్లి నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంటుంది. తొలుత ఈ సినిమాని ఓటీటీలో వచ్చే ఏడాది విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే, ఫ్యాన్స్ రిక్వెస్ట్ వల్ల ముందే విడుదల చేస్తున్నారు.