‘జైలర్’ గెట్ రెడీ

రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘జైలర్’. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్టు 10న వరల్డ్‌‌వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది. ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా, వాటికి  మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆడియో రిలీజ్‌‌ ఈవెంట్‌‌ని చెన్నైలో భారీగా ప్లాన్ చేశారు. ఈ నెల 28న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించనున్నట్టు శనివారం తెలియజేశారు. ‘గెట్ రెడీ.. ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ అందరికీ ఈ వేదిక సాక్ష్యం కానుంది’ అంటూ సోషల్ మీడియాలో మూవీ టీమ్ పోస్ట్  చేయడంతో ఆడియో రిలీజ్ ఈవెంట్ కోసం రజినీ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఇందులో రజినీ జైలర్‌‌‌‌గా నటించగా, ఆయనకు జంటగా తమన్నా నటించింది. రమ్యకృష్ణ,   మోహన్‌‌లాల్‌‌, శివ రాజ్ కుమార్, జాకీష్రాఫ్, నాగబాబు, సునీల్ కీలక పాత్రలు పోషించారు.  అనిరుధ్ సంగీతం అందించాడు.