ఏఐ టెక్నాలజీతో ‘శారీ’ ..

 ఏఐ టెక్నాలజీతో  ‘శారీ’ ..

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతోన్న చిత్రం  ‘శారీ’. సత్య యాదు, ఆరాధ్య దేవి జంటగా గిరి కృష్ణ కమల్ దర్శకత్వంలో రవి వర్మ నిర్మిస్తున్నారు.  రియల్ ఇన్సిడెంట్స్‌‌‌‌‌‌‌‌ను బేస్ చేసుకుని  సైకలాజికల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఐ వాంట్ లవ్’ అనే లిరికల్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ పాట కోసం సరికొత్తగా వచ్చిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీని ఉపయోగించారు వర్మ. మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా ఏఐ టెక్నాలజీతోనే సాంగ్ కంపోజ్ చేశామని,  బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ స్కోరును కూడా ఏఐ మ్యూజిక్‌‌‌‌‌‌‌‌నే ఉపయోగిస్తున్నట్టు ఆర్జీవీ చెప్పారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ  పాటను విడుదల చేశారు.