అడ్వెంచరస్‌‌‌‌‌‌‌‌ జర్నీ.. తంగలాన్‌‌‌‌‌‌‌‌

విక్రమ్ హీరోగా నటించిన  పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్‌‌‌‌‌‌‌‌’.  పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌.  దర్శకుడు పా.రంజిత్ రూపొందించిన ఈ చిత్రాన్ని  కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఆగస్టు 15న సినిమా విడుదలవుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని  మైత్రీ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా సోమవారం విజయవాడలో ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్ నిర్వహించారు. 

విక్రమ్ మాట్లాడుతూ ‘తెలుగు ప్రేక్షకులు  మంచి సినిమాను ఎంతగా సపోర్ట్ చేస్తారో నాకు తెలుసు.  నా ‘అపరిచితుడు’ మూవీని బాగా ఆదరించారు. ఇక ఈ చిత్రానికొస్తే.. ఇదొక అడ్వెంచరస్‌‌‌‌‌‌‌‌ మూవీ. ప్రేక్షకులందరికీ నచ్చేలా అన్ని ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌తో రంజిత్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక కొత్త ప్రపంచంలోకి  తీసుకెళ్తుంది’ అని చెప్పాడు. మాళవిక మోహనన్ మాట్లాడుతూ ‘. ఇలాంటి  గొప్ప మూవీలో నటించడం సంతోషంగా ఉంది.

 ‘ఆరతి’ అనే పాత్రలో  కనిపిస్తా. నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది బెస్ట్ రోల్’ అని చెప్పింది. ఇందులో గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్ చేశానన్నాడు హాలీవుడ్ నటుడు డేనియల్. ఈ చిత్రంలో మెస్మరైజింగ్ కంటెంట్ ఉందని నిర్మాత ధనుంజయన్ అన్నారు.