అమరవీరుల స్థూపం కూల్చివేత.. కౌశిక్ రెడ్డి తీరుపై విమర్శలు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గతంలో కట్టిన అమరవీరుల స్థూపాన్ని మున్సిపాలిటీ అధికారులు కూల్చేవేశారు. బుధవారం (జూన్ 21న) అమరవీరుల స్థూపాన్ని మున్సిపల్ సిబ్బంది కూల్చివేసింది. పాతది ఉండగానే బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అయ్యాక కొత్తగా అమరవీరుల స్థూపాన్ని అధికారులు నిర్మించారు. పాత స్థూపం ఉండగానే కొత్తది కట్టించాల్సిన అవసరం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిలాఫలకంలో తన పేరు కోసమే కౌశిక్ రెడ్డి కొత్త స్థూపం కట్టించారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. 

ALSO READ:బీఆర్ఎస్, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయి: బండి సంజయ్