హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రెండు యూనివర్సిటీల పేర్లు మారనున్నాయి. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీతో పాటు తెలంగాణ మహిళా యూనివర్సిటీ పేర్లను మార్చాలని సర్కారు నిర్ణయించింది. ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేసిన తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు ఉండగా, దాన్ని మార్చి తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.
కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా యూనివర్సిటీగా గత ప్రభుత్వం అప్గ్రేడ్ చేయగా, ఆ వర్సిటీని చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీగా మార్చనున్నారు. ఈ రెండు వర్సిటీల పేర్ల మార్పుపై శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర పడనున్నది.