యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఐడీకి బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు. ఇదివరకు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యాప్స్ తో అన్ లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ చేసుకునే వీలుండేది. అయితే దాన్ని మార్చుతూ సంబంధిత యాప్స్ లో యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ తీసుకురాబోతోంది ఎన్ పీసీఐ.
యూపీఐ డిజిటల్ పైప్‌లైన్‌ను నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ), యాప్స్ లో పేమెంట్ వాల్యూమ్‌ను 30 శాతానికి తగ్గించడానికి ఆలోచిస్తుంది. డిసెంబర్ 31లోగా ఈ నిర్ణయాన్ని అమలు చేసేదిశగా రిజర్వ్ బ్యాంక్‌తో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో 80 శాతం మార్కెట్ షేర్ ని ఫోన్ పే, గూగుల్ పేకే ఉన్నాయి. మిగిలిన పేమెంట్ యాప్స్ అన్నీ కలిపి ఉన్నది 20 శాతం షేర్లే. ఒకే యాప్ తో ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల పేమెంట్ ట్రాఫిక్ పెరుగుతుంది. దాన్ని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తుంది ఎన్ పీసీఐ.