న్యూఢిల్లీ : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) దీపావళి సందర్భంగా తెలుగు సహా పలు భాషల్లో మొబైల్‌యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దాని కార్పొరేట్ వెబ్‌సైట్ www.nseindia.comని విస్తరించింది. మొత్తం 11 ప్రాంతీయ భాషల్లో సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అస్సామీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగు భాషల్లో సమాచారం పొందవచ్చు.
ఇప్పటికే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ భాషల్లో సేవలు అందిస్తోంది. ఇండెక్సెస్, మార్కెట్ స్నాప్‌షాట్, మార్కెట్ట్రెండ్, టర్నోవర్, నిఫ్టీ 50 టాప్ గెయినర్లు, లూజర్లు, ఆప్షన్చెయిన్, యాక్టివ్ కాల్స్, పుట్స్ వంటి వివరాలు తెలుసుకోవచ్చు.