మార్చురీలో డెడ్ బాడీని కొరికిన ఎలుకలు.. ప్రభుత్వ ఆస్పత్రిలో మరో దారుణం..!

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చురీలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఆదివారం (జులై 30న) రోజు పెంకుల రవి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. సోమవారం (జులై 31న) ఉదయం కల్లా మృతుడు రవి ముఖం, చెంపలు, నుదుటి భాగం భాగంలో ఎలుకలు కొరికాయి. 

రవి ముఖాన్ని ఎలుకలు కొరికిన విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. మార్చురీ సిబ్బంది నిర్లక్షం వల్లే ఈ ఘటన జరిగిందంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి పట్టణంలోని ప్రగతి నగర్ లో నివసిస్తూ లారీ డ్రైవర్ గా పని చేసేవాడు రవి.