హైకోర్టు కొత్త సీజే జస్టిస్‌‌ అలోక్‌‌ అరధే

  • కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు

హైదరాబాద్, వెలుగు: హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్‌‌ అలోక్‌‌ అరధేను నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుత హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్‌‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ అరధే తెలంగాణ హైకోర్టు సీజేగా వస్తున్నారు. 

ALSO READ :వర్సిటీలను కాపాడుకుందాం

మధ్యప్రదేశ్‌‌కు చెందిన జస్టిస్‌‌ అరధే. 2009 డిసెంబర్‌‌లో అక్కడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుల య్యారు. 2018 నుంచి కర్నాటక హైకోర్టు న్యాయమూర్తిగా చేస్తున్నారు. ఇప్పుడు పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌ అవనున్నారు.