ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిపాలనా వికేంద్రీకరణకు ప్రామాణికంగా ఉన్న గ్రామ పంచాయితీలు, సర్పంచ్ లను తెలంగాణ సర్కారు పంచాయతీ రాజ్ చట్టం-2018 అన్న చట్రంలో బందీలను చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పార్టీ గుర్తులు లేకుండా ప్రజలచే నేరుగా ఎన్నికైన సర్పంచ్లు ప్రజలకే జవాబుదారీగా ఉండాలి. కానీ కొత్త పంచాయతీ రాజ్ చట్టం సర్పంచ్లను కలెక్టర్లకు కట్టు బానిసలుగా మార్చేసింది.
పంచాయతీ వ్యవస్థ.. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యానికి నమూనా. పాలనా వికేంద్రీకరణకు ఆనవాలు, ప్రజలకు అత్యంత చేరువగా ఉండే ప్రజాప్రతినిధి వ్యవస్థకు చిరునామా. అలాంటి వ్యవస్థను ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు నిర్వీర్యం చేస్తే, ప్రత్యేక రాష్ట్రంలోనూ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పాలనలో పంచాయతీలు నిర్జీవ దశకు చేరుకున్నాయనడంలో సందేహం లేదు. సర్కారు ఏకపక్షంగా, దురుద్దేశంతో తనకున్న ఎమ్మెల్యేల బలంతో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొత్త పంచాయతీ రాజ్ చట్టం–-2018 అనే చట్రంలో పంచాయతీ పాలకవర్గాలను బంధించింది. ప్రజలకు బాధ్యత వహించాల్సిన సర్పంచ్ లు ఇప్పుడు పాలనాపరమైన ఒత్తిడులు, ఇబ్బందులకు గురై విలవిలలాడుతున్నారు.
సర్పంచ్ లను ఉద్యోగుల్లా చూస్తున్నరు
గ్రామ స్థాయిలో మెజారిటీ ప్రజల ఆమోదంతో ఎంపీ, ఎమ్మెల్యేల మాదిరిగానే ఎన్నికైన సర్పంచ్లు ప్రజాప్రతినిధులుగా కాక ప్రభుత్వం కింద పనిచేసే ఉద్యోగులుగా కొత్త పంచాయతీ రాజ్ చట్టం మార్చేసింది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు దక్కిన హక్కులు, అధికారాలను ఈ చట్టం హరించడమే కాక, వారిపై బాధ్యతలను పెంచి వాటిని నిర్వహించకపోతే కలెక్టర్ల ద్వారా సస్పెన్షన్, తొలగింపు లాంటి శిక్షలకు గురి చేస్తోంది. ఇది ముమ్మాటికీ ప్రజాప్రాతినిధ్య చట్టానికి, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమైనది. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు, ప్రజలకు చట్టం ప్రకారం బాధ్యత వహించాల్సిన సర్పంచ్ కు, చట్టం ద్వారా ఎలాంటి బాధ్యతలు లేని ఉప సర్పంచ్ కు జాయింట్ చెక్ పవర్ ఇచ్చి గ్రామాల్లో సమాంతర పాలనకు ప్రభుత్వం తెరతీసింది. ఇది గ్రామాల్లో నిరంతర రాజకీయ వివాదాలకు, అభివృద్ధి నిరోధానికి కారణమైంది. దీని ద్వారా ప్రతిపక్షాలకు చెందిన సర్పంచ్లనే కాక, రాజకీయ అండలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా సర్పంచ్లను వేధింపులకు గురిచేస్తోంది. మొక్క బతకలేదని, మోరీ కట్టలేదని, ఊరిలో ఉండడం లేదని, ప్రకృతివనం, వైకుంఠధామం, రైతు వేదిక నిర్మించలేదన్న సాకులతో రాజకీయ కక్ష సాధింపులకు దిగుతోంది. గ్రామాల్లో ఎన్నో పనులను అప్పులు చేసి మరీ సకాలంలో నిర్మించినా ఉప సర్పంచ్లు కమీషన్ కావాలంటూ చెక్కులపై సంతకం చేయడం లేదు. వాళ్లు సంతకం పెట్టినా ఇంజనీరింగ్ అధికారులు బిల్లులు చేయడం లేదు. దీంతో సర్పంచ్లే తమ ఆస్తులు అమ్మి అప్పులు తీర్చుకోవాల్సి వస్తోంది. అప్పుల బాధలు భరించలేని కొందరు సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకోగా.. మరికొందరు సూసైడ్ అటెంప్ట్ చేసి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సర్పంచ్ల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి.
కలెక్టర్ల నోటీసులు దారుణం
రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులపై ఉన్న నమ్మకం సర్పంచ్లపై లేకపోవడం దురదృష్టకరం. 80%పైగా ఉన్న అధికార పార్టీ సర్పంచ్లకు కూడా ఈ వేధింపుల నుంచి మినహాయింపు లేదు. ఏడాదిగా బిల్లులు చెల్లించక పోగా, పంచాయతీ సాధారణ నిధులను కూడా డ్రా చేసుకోకుండా ప్రభుత్వం ‘ఫ్రీజింగ్’పెట్టింది. గ్రామస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు సర్పంచ్లను వేగంగా పరుగెత్తమని చెబుతూనే ‘ఉప సర్పంచ్’అనే గుదిబండను తగిలించింది. పల్లె ప్రగతి కార్యాచరణ ప్రణాళికలో భాగమైన వైకుంఠ ధామం, డంపింగ్ యార్డ్, పార్క్ లాంటి పనులు పూర్తి చేయలేదన్న నెపంతో మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదంటూ రాష్ట్రంలో వేలాది మంది సర్పంచ్లకు ఆయా జిల్లాల కలెక్టర్లు నోటీసులు ఇవ్వడం దుర్మార్గం. సర్పంచ్ల అధికారాలకు ఉప సర్పంచ్ చెక్ పవర్, సహకరించని అధికారులనే రోకలి కట్టి వేగంగా ముందుకు సాగాలంటే ఎలా కుదురుతుంది. చేసే పనులకు స్థలాలను అప్పగించని రెవెన్యూ శాఖ, అంచనాలు, మార్కింగ్ ఇవ్వని ఇంజనీరింగ్ శాఖ వీటితోపాటు గత ఏడాది చేసిన పనులకే డబ్బులు రాక సర్పంచ్లు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయారు. ఈ విషయాలపై కలెక్టర్లకు, డీపీవోలకు ఎన్ని అర్జీలు ఇచ్చినా స్పందించకుండా ఇప్పుడు సర్పంచ్లకు తాఖీదులు ఇవ్వడం అధికార దుర్వినియోగమే అవుతుంది.
ఇప్పటికైనా ప్రభుత్వం పంచాయతీలను స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించి, వాటిని స్వయంపోషకాలుగా, రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు అందజేసే కార్యాలయాలుగా గుర్తించాలి. అప్పుడే గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాధ్యమవుతుంది. అధికారం శాశ్వతం కాదు.. అధికారంలో ఉన్నపుడు తీసుకున్న ప్రజాహిత, సంక్షేమ నిర్ణయాలే శాశ్వతమన్న వాస్తవం ప్రస్తుత పాలకులు గుర్తించాలి. ఇప్పటికైనా కొత్త పంచాయతీ రాజ్ చట్టంలో ప్రజాహిత పాలనకు అనుకూలంగా సవరణలు చేస్తారని ఆశిద్దాం. లేకపోతే సర్పంచ్ల హక్కుల పరిరక్షణ, 73వ రాజ్యాంగ సవరణల ద్వారా సంక్రమించిన అధికారాల బదలాయింపు కోసం సర్పంచ్లంతా న్యాయ పోరాటానికి సిద్ధం కావాలి.
ఎంపీలు, ఎమ్మెల్యేలకు బాధ్యత లేదా?
పంచాయతీ వ్యవస్థలో రిజర్వేషన్ల కారణంగా అనేక మంది పేద వర్గాల వారు సర్పంచ్లు గా ఎన్నికయ్యారు. వీరిలో ఎక్కువ మంది పెద్దగా చదువుకోలేదు. చట్టాలపై అవగాహన లేదు. ఇలాంటి వారంతా అధికారుల చేతిలో మోసపోతున్నారు. మరోవైపు రాజకీయాల్లోకి వచ్చి మంచి కార్యక్రమాలతో ప్రజలకు చేరువ కావాలన్న యువ సర్పంచ్లకు ఆశ నెరవేరడం లేదు. ప్రభుత్వం సర్పంచ్లు ఒక్కరినే గ్రామాల అభివృద్ధికి, ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు బాధ్యులను చేస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జడ్పీటీసీలకు గ్రామాల అభివృద్ధిలో బాధ్యత లేదా. లక్షల్లో గౌరవ వేతనాలు, గౌరవాలు, గన్ మెన్ల లాంటి వసతులు పొందుతున్న వారిని గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి వైఫల్యానికి బాధ్యులను చేస్తూ సీఎం, కలెక్టర్లు ఎందుకు తాఖీదులు ఇవ్వరో ప్రజలకు తెలపాలి. మూడు నెలలకు ఒక్కసారి అరకొరగా గౌరవంలేని గౌరవ వేతనం ఇస్తూ మాపై కలెక్టర్లు, డీపీవోల నుంచి ఎంపీడీవోల దాకా పెత్తనం చెలాయిస్తున్న తీరుపై పోరాటం జరగాలి. పల్లెప్రగతి కార్యక్రమంలో అధికారుల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, సీఎం మెప్పు పొందేందుకు సర్పంచ్లకు కలెక్టర్లు ఇచ్చిన తాఖీదులపై న్యాయపోరాటానికి సర్పంచ్లు సిద్ధం కావాలి.
నిధుల విషయంలో మోసం
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి రాష్ట్రం 42% నిధులు పొందుతోంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వ పాలనలో కేంద్రం జోక్యాన్ని సీఎం వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో పంచాయతీల అధికారాలను గుప్పిట్లో ఉంచుకుని అధికారులతో పాలన సాగిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ లో రూపాయి కూడా పంచాయతీలకు ఇవ్వకుండా, కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘ నిధులను కూడా తన వద్ద ఉంచుకుని వాయిదాల పద్ధతిలో తానే ఇస్తున్నట్లు మోసం చేస్తున్నారు. బిల్లులు రాక సర్పంచ్లు ఆర్థికంగా దెబ్బతింటే పంచాయతీ రాజ్ మంత్రి, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోగా, అధికారుల వేధింపులపై ఫిర్యాదు చేసినా స్పందించలేదు. గ్రామాల్లో ట్రాక్టర్ల నిర్వహణ తలకు మించిన భారమైనది. పంచాయతీల్లో వీధి లైట్ల నిర్వహణ నుంచి కూడా తప్పించడం దారుణం. అనేక రాష్ట్రాల్లో సేవలు అందించడంలో విఫలమైన ఈఈఎస్ఎల్ సంస్థకు పంచాయతీల మెడపై కత్తి పెట్టి కోట్లాది రూపాయల కాంట్రాక్టును అదే సంస్థకు కట్టపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నం ప్రభుత్వం, అధికారుల స్వార్థాన్ని తెలియజేస్తోంది.
–జూలూరు ధనలక్ష్మి, అధ్యక్షురాలు, తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల సంఘం మహిళా విభాగం
రాష్ట్ర సర్కార్ గుప్పిట్లో సర్పంచ్లు
- వెలుగు ఓపెన్ పేజ్
- January 19, 2021
లేటెస్ట్
- విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ
- బుద్వేల్లో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన DCM
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- హైదరాబాద్ నడిబొడ్డున రూ.11 లక్షల నకిలీ సిగరెట్లు సీజ్
- బీర్ల ధరల పెంపు.. కొత్త బ్రాండ్ బీర్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- తిండైన మానేస్తారు కానీ వాళ్ళు అది మాత్రం ఆపరు: రాశీ కన్నా
- షమీ వచ్చేశాడు.. ఇక వార్ వన్ సైడే: 14 నెలల తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ
- గుండెపోటుతో తాటిచెట్టుపైన గీతకార్మికుడు మృతి
- IND vs ENG: ఇంగ్లండ్తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- బుజ్జితల్లి వీడియో సాంగ్ రిలీజ్.. ఎమోషనల్ ట్రీట్ ఇచ్చారుగా..
Most Read News
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- Fateh Box Office: గేమ్ ఛేంజర్కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- కొత్త రేషన్ కార్డుల జారీకి పక్కాగా అర్హుల ఎంపిక: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- IND vs ENG: ఇంగ్లండ్తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- కాంటినెంటల్ హాస్పిటల్లో అరుదైన సర్జరీ
- Daaku Maharaj: డాకు మహారాజ్ బుకింగ్స్ ఓపెన్.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?