ఒకే భవనం.. వేర్వేరుగా ప్రారంభం

  • ఒంటి గంటకు పీహెచ్​సీని ప్రారంభించిన ఎమ్మెల్యే పాల్వాయి
  • అదే బిల్డింగ్​ను 3 గంటలకు ఓపెన్​ చేసిన జడ్పీ చైర్మన్ కృష్ణారావు

దహెగాం, వెలుగు : కొత్తగా నిర్మించిన పీహెచ్ సీ బిల్డింగ్​ను ఒకేరోజు ఇద్దరు ప్రజాప్రతినిధులు వేర్వేరుగా ప్రారంభించడం చర్చనీయాంశమైంది. ఆసిఫాబాద్​ జిల్లా దహెగాం మండల కేంద్రంలో రూ.1.56 కోట్ల 15వ​ఆర్థిక సంఘం నిధులతో పీహెచ్​సీ బిల్డింగ్​ నిర్మించారు. ఈ బిల్డింగ్​ను ఆదివారం మంత్రి సీతక్క ప్రారంభించాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో ఆమె ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యింది. ఇదిలాఉంటే సిర్పూర్​ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్​బాబు మధ్యాహ్నం ఒంటి గంటకు పీఏసీఎస్​ చైర్మన్​ తిరుపతి గౌడ్, వైస్​ చైర్మన్​ ధనుంజయ

డిప్యూటీ డీఎంహెచ్​వో సీతారాం నాయక్, ఈఈలు ప్రభాకర్, రామ్మోహన్, ఇన్​చార్జి మెడికల్​ ఆఫీసర్​అశ్విని, ఎంపీటీసీ రాపర్తి జయలక్ష్మితో కలిసి బిల్డింగ్​ను ప్రారంభించారు. ఇక అదే భవనాన్ని మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీటీసీ తాళ్లపల్లి శ్రీరామారావ్, ఎంపీపీ కంభగౌని సులోచన తదితరులతో కలిసి జడ్పీ చైర్మన్​ కోనేరు కృష్ణారావు మరోసారి ప్రారంభించారు. ఒకే భవనాన్ని ఒకేరోజు ఇద్దరు నేతలు వేర్వేరుగా ప్రారంభించడం చర్చనీయాంశమైంది. నేతల మధ్య పొరపొచ్చాలు, అధికారుల మధ్య సమన్వయలోపంతోనే ఇలా జరిగిందని జనం చర్చించుకుంటున్నారు.