హైదరాబాద్, వెలుగు : కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వొశ్చన్ పేపర్లో 13 తప్పులు ఉన్నాయంటున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెట్ "డి" లోని ప్రశ్నలు తీవ్ర గందరగోళానికి దారి తీశాయంటూ ప్రచారం జరుగుతున్నది. ఈ వార్తలపై పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రకటించింది. ఎలాంటి వదంతులు నమ్మవద్దని బోర్డ్ చైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.
నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాతే క్లారిటీ ఇస్తామని చెప్పారు. క్వొశ్చన్ పేపర్లో ఎలాంటి తప్పులున్నా తెలియజేస్తామన్నారు. నిపుణుల సూచనలకు అనుగుణంగా మార్కులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బుధవారం లేదా గురువారం ‘కీ’ విడుదల చేస్తామని ప్రకటించారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన 13 ప్రశ్నల్లో కేవలం 7మాత్రమే స్పష్టంగా లేవని చైతన్య ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు నర్సింహా రెడ్డి తెలిపారు.