మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి(Mammotty) హీరోగా భ్రమయుగం(Bramayugam) పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మించాయి.
ఆగస్టు 17న ఈ సినిమాను ప్రారంభించిన మేకర్స్..లేటెస్ట్ గా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నట్లు పోస్ట్ చేశారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే షూటింగ్‌ను కంప్లీట్ చేశారంటే..ఈ రోజుల్లో చాలా పెద్ద సాహసం అని చెప్పుకోవాలి. 72ఏళ్ల వయస్సు గల మమ్ముట్టి..జెడ్ స్పీడ్ తో నటించే సత్తువా ఉందంటే..తనకు సినిమాపై ఉన్న మక్కువెంతో అర్ధం అవుతుంది. ఈ భ్రమయుగం మూవీని ఒట్టపాలెం, కొచి, అథిరపల్లి తదితర ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించారు. మేకర్స్ ఈ విషయాన్ని తెలుపుతూ. ఓ నైట్ మోడ్‌లో పాడుబడ్డ చీకటి భవనంలో దిగిన ఫొటోను షేర్ చేశారు.
It's a Wrap for #Bramayugam ! #Bramayugam starring @mammukka
— Night Shift Studios LLP (@allnightshifts) October 18, 2023
Written & Directed by #RahulSadasivan
Produced by @chakdyn @sash041075
Banner @allnightshifts @studiosynot
PRO @SureshChandraa @pro_sabari @venupro pic.twitter.com/YPGSDI5xw6
హారర్ థ్రిల్లర్ జానర్‌లో కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న మూవీ..త్వరలోనే ప్రమోషన్స్‌ను ప్రారంభించనుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ సినిమాపై మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. అర్జున్ అశోకన్, సిద్దార్థ్, భరతన్, అమల్దా లిజ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. క్రిస్టో జేవియర్ సంగీతం అందిస్తున్నాడు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది విడుదల కానుంది.
లేటెస్ట్ గా మమ్ముట్టి నటిస్తూ..నిర్మించిన చిత్రం కన్నూర్ స్క్వాడ్(Kannur Squad). గత నెల 2023 సెప్టెంబర్ 28న విడుదలైన ఈ సినిమా.. రిలీజై మూడు వారాలైనా..కేరళలో దుమ్ము దులిపేస్తుంది. రూ.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన మూవీ..వరల్డ్ వైడ్‌గా రూ.75 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. కేరళలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన కన్నూర్ స్క్వాడ్ సినిమాను రాబీ వర్గీస్ రాజ్ దర్శకత్వం వహించారు.