జనగామ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ అవిశ్వాసం ముందుకు కదుల్తలే..

జనగామ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ అవిశ్వాసం ముందుకు కదుల్తలే..
  •     స్టేను ఈ నెల 15 వరకు పొడిగించిన కోర్టు
  •     ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ను మార్చిన హైకమాండ్‌‌‌‌‌‌‌‌
  •     పట్టు వీడుతున్న అసమ్మతి కౌన్సిలర్లు

జనగామ, వెలుగు : జనగామ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం ముందుకు కదలడం లేదు. చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌, వైస్‌‌‌‌‌‌‌‌చైర్మన్‌‌‌‌‌‌‌‌, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ లీడర్లను తొలగించాల్సిందేనంటూ గతంలో అసమ్మతి కౌన్సిలర్లు నోటీసు ఇచ్చారు. అయితే అవిశ్వాసంపై కోర్టు స్టే ఇవ్వడం, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ను మారుస్తూ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో కౌన్సిలర్లు తమ పట్టు వీడుతున్నట్లు తెలుస్తోంది. 

ఫిబ్రవరిలో నోటీసు ఇచ్చిన కౌన్సిలర్లు

జనగామ మున్సిల్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ పోకల జమున, వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ మేకల రాంప్రసాద్, ఫ్లోల్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ మారబోయిన పాండును మార్చాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ అధికార పార్టీకే చెందిన కౌన్సిలర్లు జనవరి 25న క్యాంపుకు వెళ్లారు. వారం రోజుల తర్వాత ఫిబ్రవరి 3న 11 మంది బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్లు కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌కు వచ్చి చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ప్రపుల్‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌కి అవిశ్వాస నోటీసు ఇచ్చారు. వీరికి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు చెందిన 8 మంది కౌన్సిలర్లు కూడా మద్దతు ఇచ్చారు. అలాగే బీజేపీకి చెందిన నలుగురు కౌన్సిలర్ల మద్దతు కూడా తమకు ఉందని అధికార పార్టీకి చెందిన అసమ్మతి కౌన్సిలర్లు చెబుతున్నారు.

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ మార్పు

జనగామ మున్సిపాలిటీలో 18 మంది బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్లు ఉండగా చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా బండ పద్మ యాదగిరిరెడ్డి,  పేర్ని స్వరూప, అరవింద్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కర్రె శ్రీనివాస్, పాక రమ, దేవరాయి నాగరాజు, ముస్త్యాల దయాకర్, వాంకుడోతు అనిత, నీల శ్రీజ రామ్మోహన్, మల్లిగారి చంద్రకళ, జూకంటి లక్ష్మి వ్యవహరిస్తున్నారు. కౌన్సిలర్లు నోటీసు ఇవ్వడంతో ప్రస్తుతం ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న మారబోయిన పాండును తొలగించి ఆయన స్థానంలో అసమ్మతి వర్గానికి చెందిన అరవింద్‌‌‌‌‌‌‌‌రెడ్డిని నియమించారు. దీంతో పాటు మరో ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లకు సైతం పలు హామీలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీకే చెందిన తాళ్ల సురేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, పగిడిపాటి సుధ, గుర్రం భూలక్ష్మి, ఎండీ సమద్‌‌‌‌‌‌‌‌ మాత్రం ఈ వ్యవహారానికి దూరంగా ఉన్నారు.


నిరాశలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్లు

అవిశ్వాసాన్ని అడ్డం పెట్టుకొని మేలు పొందాలని చూసిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్ల ఆశలు గల్లంతయ్యాయి. చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌పై ఇచ్చిన అవిశ్వాసానికి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్లు జక్కుల అనిత వేణుమాధవ్, మంత్రి సుమలత, గాదెపాక రాంచందర్​, గంగరబోయిన మల్లేశం, వంగాల కల్యాణి మల్లారెడ్డి, రామగల్ల అరుణ , ముస్తాల చందర్, బాల్దె కమలమ్మ మద్ద తు తెలిపారు. ముందుగా చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌, వైస్‌‌‌‌‌‌‌‌చైర్మన్‌‌‌‌‌‌‌‌, ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ను తొలగిస్తే ఆ తర్వాత ఎవరికి ఏ పదవులు కావాలో బీఆర్ఎస్ అసమ్మతి, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్ల మంతా కలిసి నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. కానీ అవిశ్వాసంపై ఇప్పటికే కోర్టు రెండు సార్లు స్టే ఇచ్చింది. తాజాగా మరోసారి ఈ నెల 15 వరకు స్టేను పొడిగించింది. దీంతో అవిశ్వాసం పై ఆఫీసర్లు ముందుకు వెళ్లడం లేదు.