ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు సహకరించండి : ప్రయాణం సాఫీగా సాగేలా చూడండి

ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు సహకరించండి : ప్రయాణం సాఫీగా సాగేలా చూడండి

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ప్రతిఏటా అంతకంతకూ పెరుగుతోంది. దీని వల్ల శంషాబాద్ విమానాశ్రయంలో విజిటర్స్ తో పాటు ప్యాసింజర్స్ పెద్ద సంఖ్యలో వస్తుండడంతో రద్దీ కనిపిస్తోంది. ఎయిర్ పోర్టుకు చాలామంది తమ సొంత వాహనాలు అంటే కార్లు, బైక్ లు తీసుకువస్తుండడంతో మిగతా ప్రయాణికులు కొంత ఇబ్బందులు పడతున్నారు. కార్లను ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయడం వల్ల, ఒక క్రమానుసారంగా పార్కింగ్ చేయకపోవడం వల్ల, నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. 

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు హై సెక్యూరిటీ అలర్ట్‌లోకి వెళ్లిపోయింది. అందువల్ల ప్రయాణికులు, విజిటర్స్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చే సమయంలో తమ వాహనాలను సరైన పద్ధతిలో పార్కింగ్ చేసి, తమకు సహకరించాలని ఎయిర్ పోర్టు సిబ్బంది కోరుతున్నారు. ప్రజల ప్రయాణం సౌకర్యంగా, సుఖవంతంగా సాగేలా అందరూ  తమకు సహకరించాలని ఎయిర్ పోర్టు సిబ్బంది కోరారు.