MLC elections: భారీగా పెరిగిన గ్రాడ్యుయేట్‌‌‌‌ ఓటర్లు..

MLC elections: భారీగా పెరిగిన గ్రాడ్యుయేట్‌‌‌‌ ఓటర్లు..
  • నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్‌‌‌‌ పరిధిలో 2.35 లక్షల మంది అప్లై
  • గత ఎన్నికల టైంలో అప్లై చేసింది 1.96 లక్షల మందే..
  • ఈ నెల 6తో ముగియనున్న ఎన్‌‌‌‌రోల్‌‌‌‌మెంట్‌‌‌‌ గడువు
  • రెండు రోజుల్లో మరో 30 వేలకుపైగా అప్లికేషన్లు వస్తాయని అంచనా
  • ఎన్‌‌‌‌రోల్‌‌‌‌కు దూరంగా ఇంకా సగం మంది గ్రాడ్యుయేట్లు


కరీంనగర్, వెలుగు : వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటర్ల సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది. 2019 ఎన్నికల్లో 1.96 లక్షల మంది ఎన్‌‌‌‌రోల్‌‌‌‌ చేసుకోగా.. ప్రస్తుత ఎన్నికల్లో సోమవారం నాటికే 2.40 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఎన్‌‌‌‌రోల్‌‌‌‌కు ఇంకా రెండు రోజులు చాన్స్‌‌‌‌ ఉండడంతో మరో 30 వేల అప్లికేషన్లు రావొచ్చని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎన్‌‌‌‌రోల్‌‌‌‌ అయిన వారి సంఖ్య పెరిగినప్పటికీ... ఇప్పుడున్న గ్రాడ్యుయేట్స్‌‌‌‌లో ఇంకా సగం మంది అప్లై చేసుకోలేదని ఎమ్మెల్సీ ఆశావాహులు అభిప్రాయపడుతున్నారు. మిగిలిన వారందరినీ ఎన్‌‌‌‌రోల్‌‌‌‌ చేయించేందుకు ప్రత్యేక టీమ్స్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. 

సగం అప్లికేషన్లు ఉమ్మడి కరీంనగర్‌‌‌‌ జిల్లాలోనే...

కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్‌‌‌‌ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ఓటరు నమోదుకు సెప్టెంబర్ 30 నుంచి చాన్స్‌‌‌‌ కల్పించారు. కొత్తగా ఏర్పడిన 15 జిల్లాల పరిధిలోని 271 మండలాల్లో ఎన్‌‌‌‌రోల్‌‌‌‌మెంట్‌‌‌‌ జరుగుతోంది. ఎమ్మెల్సీ క్యాండిడేట్లుగా పోటీ చేయాలనుకుంటున్న వారు ‘మిస్డ్‌‌‌‌ కాల్‌‌‌‌’ క్యాంపెయిన్‌‌‌‌ నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా టీమ్స్‌‌‌‌ను ఏర్పాటు చేసి.. గ్రాడ్యుయేట్ల నుంచి డిగ్రీ మెమో, ప్రొవిజనల్స్, ఓటరు ఐడీ సేకరించి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లై చేయిస్తున్నారు. ఇలా సోమవారం ఉదయం వరకు నాలుగు పాత జిల్లాల పరిధిలో మొత్తం 2,35,576 అప్లికేషన్లు రాగా ఇందులో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో 2,34,241, ఆఫ్‌‌‌‌లైన్‌‌‌‌లో 1,335 వచ్చాయి. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా కరీంనగర్‌‌‌‌ జిల్లాలో 1,17,129 అప్లికేషన్లు వచ్చాయి. ఆ తర్వాత 49,341 అప్లికేషన్లతో మెదక్‌‌‌‌, 44,919 అప్లికేషన్లతో ఆదిలాబాద్‌‌‌‌, 24,187 అప్లికేషన్లతో నిజామాబాద్‌‌‌‌ ఉన్నాయి. ఈ నెల 6తో అప్లికేషన్ల గడువు ముగుస్తుండడంతో అర్హులైన వారు త్వరగా అప్లై చేసుకోవాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు.

వెరిఫికేషన్‌‌‌‌ విషయంలో బీఎల్‌‌‌‌వోల నిర్లక్ష్యం

మొత్తం ఎన్‌‌‌‌రోల్‌‌‌‌ అయిన 2,35,576 అప్లికేషన్లలో ఇప్పటివరకు 1,03,234 అప్లికేషన్లను అప్రూవ్‌‌‌‌ చేయగా, 7,956 అప్లికేషన్లను వివిధ కారణాలతో రిజక్ట్‌‌‌‌ చేశారు. మరో 1,24,386 అప్లికేషన్లు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. అప్లికేషన్‌‌‌‌ చేసుకున్న వారిలో చాలా మంది ఉపాధి, ఉద్యోగాల కోసం హైదరాబాద్‌‌‌‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. గ్రాడ్యుయేట్లు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లై చేసుకున్న తర్వాత బీఎల్‌‌‌‌వోలు స్వయంగా వారి ఇండ్లకు వెళ్లి సర్టిఫికెట్‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌ చేయాలి. కానీ వారు అలా చేయకుండా గ్రాడ్యుయేట్లకు ఫోన్‌‌‌‌ చేసి తహసీల్దార్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌కుగానీ, మరో ఆఫీస్‌‌‌‌కు గానీ రావాలని సూచిస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఇబ్బందికరంగా మారింది. దీంతో వెరిఫికేషన్‌‌‌‌ సైతం ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో చేయాలని కోరుతున్నారు. మరో వైపు గ్రాడ్యుయేట్స్‌‌‌‌ ఇంకా చాలా మంది అప్లై చేసుకోవాల్సి ఉన్నందున ఎన్‌‌‌‌రోల్‌‌‌‌మెంట్‌‌‌‌ గడువును మరో నెల రోజులు పొడిగించాలని అల్ఫోర్స్‌‌‌‌ నరేందర్‌‌‌‌రెడ్డి కోరారు.

ఈ నెల 23న డ్రాఫ్ట్‌‌‌‌ ఓటర్‌‌‌‌ లిస్ట్‌‌‌‌

చివరి తేదీ లోపు వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి ఈ నెల 23న డ్రాఫ్ట్‌‌‌‌ ఓటర్‌‌‌‌ లిస్ట్‌‌‌‌ను ప్రకటించనున్నట్లు కరీంనగర్‌‌‌‌ కలెక్టర్, ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ పమేలా సత్పతి సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. డ్రాఫ్ట్‌‌‌‌ లిస్ట్‌‌‌‌పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నవంబర్ 23 నుంచి డిసెంబర్‌‌‌‌ 9 వరకు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. డిసెంబర్‌‌‌‌ 30 ఫైనల్‌‌‌‌ లిస్ట్‌‌‌‌ విడుదల చేస్తామని కలెక్టర్‌‌‌‌ పేర్కొన్నారు.