అయోధ్య రామయ్య భక్తులకు గుడ్​ న్యూస్​... 24 గంటలు దర్శనం.. ఎప్పుడంటే

అయోధ్యకు రోజు రోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ట్రస్టు అధికారులు ముందస్తు దర్శన సమయాన్ని పెంచారు. ఏప్రిల్​ 17 నుంచి మూడు రోజుల పాటు 24 గంటలు దర్శనం కల్పించనున్నారు.  అయోధ్య రామమందిరంలో మరో ఉత్సవం జరగనుంది. అయోధ్యలో కొత్త ఆలయాన్ని నిర్మించిన తర్వాత.. మొదటిసారిగా శ్రీరాముని పుట్టినరోజు జరుపుకునే సమయం వచ్చింది. శ్రీరాముడి పుట్టిన రోజు ఏప్రిల్ 17 వ తేదీన ఉంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 17 వ తేదీ నుంచి 3 రోజులపాటు ఉత్సవాలు జరపాలని శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత జరిగిన తరువాత  తొలి కార్యక్రమం కావడంతో భక్తులు భారీగా తరలివస్తారని అంచనా వేస్తున్న ట్రస్ట్.. అందుకు తగ్గట్లు అయోధ్యలో భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోంది. 

శ్రీరామనవమికి అధిక సంఖ్యలో అయోధ్యకు భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున వారందరికి బాలరాముడి దర్శనాలు కల్పించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 17 వ తేదీ నుంచి 3 రోజులపాటు ఆలయ తలుపులు 24 గంటలూ తెరచి ఉండనున్నాయని ఆలయ అధికారులు వెల్లడించారు. కొన్ని సమయాల్లో మాత్రం కొద్దిసేపు మాత్రమే ఆలయ తలుపులు మూసివేయాలని నిర్ణయించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు

ALSO READ | యాదగిరి గుట్ట : నమో.. నారసింహ

. అయోధ్య బాలరాముడికి నైవేద్యం సమర్పించేటప్పుడు.. అలంకారం చేసేటప్పుడు మాత్రమే భక్తులకు దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఇక శ్రీరాముని జన్మదినోత్సవ వేడుకలకు నెల రోజుల సమయం ఉన్నప్పటికీ అయోధ్యకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా అధికారులు ఇప్పటినుంచే ఏర్పాట్లు మొదలుపెట్టారు. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి దర్శనంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం అయోధ్య రామాలయం తలుపులు సాధారణ భక్తుల దర్శనం కోసం ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంచుతున్నారు. ఈ సమయాల్లోనే భక్తులకు బాలరాముడు దర్శనం ఇస్తున్నాడు. అయితే ఆ బాలక్ రామ్ జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని మూడు రోజుల పాటు దర్శన సమయాన్ని పెంచనున్నారు. ఈ ఉత్సవానికి వివిధ రాష్ట్రాలనుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అయోధ్య బాలరాముడిని దర్శించుకునే భక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు.. వివిధ రాష్ట్రాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను ప్రారంభించారు.