2023 సంవత్సరం క్రీడాభిమానులకు పండగ కానుంది. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ తో పాటు..హాకీ వరల్డ్ కప్ జరగనుంది. ఈ రెండు మెగా ఈవెంట్లు భారత్ లోనే జరగనున్నాయి. వీటితో పాటు.. ఆసియా క్రీడలు, ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్, బ్యాడ్మింటన్,టెన్నిస్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లోనూ టోర్నీలు జరగనున్నాయి.
క్రికెట్ ...
జనవరి 3 నుంచి జనవరి 15 వరకు భారత్‌లో శ్రీలంక పర్యటించనుంది. 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఇక జనవరి 14 జనవరి 29 వరకు సౌతాఫ్రికాలో మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్ జరుగుతుంది. ఆ తర్వాత జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ఆడేందుకు భారత్‌లో న్యూజిలాండ్ పర్యటించబోతుంది. ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 26 వరకు దక్షిణాఫ్రికాలో మహిళల టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. ఫిబ్రవరి 13 నుంచి మార్చి 22 వరకు 4 టెస్టులు, 3 వన్డేల సిరీస్ ఆడేందుకు భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటించనుంది. మార్చి నుంచి మే వరకు ఐపీఎల్ జరుగుతుంది.
బ్యాడ్మింటన్ ...
జనవరి 17 నుంచి జనవరి 22 వరకు ఇండియా ఓపెన్ జరగనుండగా..మార్చి 7 నుంచి మార్చి 12 వరకు జర్మన్ ఓపెన్, మార్చి 14 నుంచి మార్చి 19 వరకు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ నిర్వహిస్తారు. మార్చి 21 నుంచి మార్చి 26 వరకు స్విస్ ఓపెన్, మే 30 నుంచి జూన్ 4 వరకు థాయ్‌లాండ్ ఓపెన్, జూన్ 6 నుంచి జూన్ 11 వరకు సింగపూర్ ఓపెన్ జరుగుతుంది. జూన్ 13 నుంచి జూన్ 18 వరకు ఇండోనేషియా ఓపెన్, జూలై 11 నుంచి జూలై 16 వరకు యూఎస్ ఓపెన్ నిర్వహిస్తారు. జూలై 18 నుంచి జూలై 23 వరకు కొరియా ఓపెన్, జూలై 25 నుంచి జూలై 30 వరకు జపాన్ ఓపెన్, ఆగస్టు 1 నుంచి ఆగస్టు 6 వరకు ఆస్ట్రేలియా ఓపెన్, సెప్టెంబరు 5 నుంచి 10 వరకు చైనా ఓపెన్ జరుగుతుంది. సెప్టెంబరు 11 నుంచి 17 వరకు వరల్డ్ సీనియర్ చాంపియన్‌షిప్, సెప్టెంబరు 12 నుంచి 17 వరకు హాంకాంగ్ ఓపెన్, అక్టోబరు 17 నుంచి 22 వరకు డెన్మార్క్ ఓపెన్, అక్టోబరు 24 నుంచి -29 ఫ్రెంచ్ ఓపెన్, నవంబరు 28 నుంచి డిసెంబరు 3 వరకు సయ్యద్ మోదీ టోర్నీ, డిసెంబరు 5 నుంచి 10 వరకు ఇండియా సూపర్ 100, డిసెంబరు 13 నుంచి 17 వరకు వరల్డ్ టూర్ ఫైనల్స్ జరగనుంది.
షూటింగ్..
జనవరి 11 నుంచి 24 వరకు వరల్డ్‌కప్ షాట్‌గన్, జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు వరల్డ్‌కప్ రైఫిల్, ఫిబ్రవరి 17 నుంచి 28 వరకు వరల్డ్‌కప్ ఫిస్టల్, మార్చి 4 నుంచి 15 వరకు వరల్డ్‌కప్ షాట్‌గన్, మార్చి 20 నుంచి 31 వరకు వరల్డ్‌కప్ రైఫిల్, మార్చి 25 నుంచి ఏప్రిల్ 6 వరకు వరల్డ్‌కప్ షాట్‌గన్, ఏప్రిల్ 11 నుంచి 22 వరకు వరల్డ్‌కప్ రైఫిల్, మే 4 నుంచి 15 వరకు వరల్డ్‌కప్ రైఫిల్, జూన్ 1 నుంచి 12 వరకు వరల్డ్‌కప్ రైఫిల్, జూలై 6 నుంచి 17 వరకు వరల్డ్‌కప్ షాట్‌గన్, ఆగస్టు 14 నుంచి సెప్టెంబరు 3 వరకు వరల్డ్ చాంపియన్‌షిప్, సెప్టెంబరు 8 నుంచి 19 వరకు వరల్డ్‌కప్ రైఫిల్ టోర్నీ జరగనుంది.
టెన్నిస్..
జనవరి 16 నుంచి జనవరి 29 వరకు ఆస్ట్రేలియా ఓపెన్ జరగనుంది. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు డేవిస్ కప్ క్వాలిఫయర్స్ టోర్నీ, మే 28 నుంచి జూన్ 11 వరకు ఫ్రెంచ్ ఓపెన్, జూలై 3 నుంచి జూలై 16 వరకు వింబుల్డన్, ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 10 వరకు యూఎస్ ఓపెన్, సెప్టెంబరు 14 నుంచి17 వరకు డేవిస్ కప్ గ్రూప్ దశ పోటీలు జరుగుతాయి. అక్టోబరు 30 నుంచి నవంబరు 6 వరకు డబ్ల్యూటీఏ ఫైనల్స్, నవంబరు 12 నుంచి 19 వరకు ఏటీపీ ఫైనల్స్ (ఇటలీ),
నవంబరు 21 నుంచి 26 వరకు డేవిస్ కప్ ఫైనల్స్ (స్పెయిన్) టోర్నీ జరుగుతుంది.
అథ్లెటిక్స్...
వీటితో పాటు..మార్చి 15 నుంచి మార్చి 31 వరకు మహిళల ప్రపంచ బాక్సింగ్ టోర్నీ, ఏప్రిల్ 15 నుంచి మే 1 వరకు వరల్డ్ స్నూకర్ టోర్నీ జరుగుతుంది. మే 7 నుంచి మే 14 వరకు ప్రపంచ జూడో టోర్నీ, మే 20 నుంచి మే 28 వరకు ప్రపంచ టేబుల్ టెన్నిస్, జూలై 14 నుంచి 30 వరకు వరల్డ్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ జరుగుతుంది. సెప్టెంబరు 2 నుంచి 17 వరకు ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్, సెప్టెంబరు 16 నుంచి 24 వరకు ప్రపంచ రెజ్లింగ్, సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 8 వరకు ప్రపంచ జిమ్నాస్టిక్స్ టోర్నీ జరగనుంది.