గెట్ రెడీ బ్రోస్ ..పవర్ స్టార్ BRO బీభత్సం రేపే

గెట్ రెడీ బ్రోస్ ..పవర్ స్టార్ BRO  బీభత్సం రేపే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) .. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కాంబోలో వస్తున్న మూవీ 'BRO'. తమిళంలో సూపర్‌ హిట్టైన వినోదయ సిత్తం మూవీకు రీమేక్‌గా రాబోతుంది. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రేపు (జూలై 22న) సా.6:03 గంటలకు 'BRO' మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో మూవీ టీం.. పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇవ్వునున్నట్లు తెలుస్తోంది. 

రీసెంట్ గా రిలీజైన టీజర్ లో ' కాలం మీ గడియారానికి  అందని ఇంద్రజాలం' అంటూ పవన్ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఇక ట్రైలర్ లో పవన్ నుంచి వచ్చే డైలాగ్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నట్లు సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు.  ఈ మూవీలో  సాయి ధరమ్ గురువుగా పవర్ స్టార్ నటిస్తుండటంతో అభిమానుల్లో పూనకాలు లోడ్ అవుతున్నాయి. 

ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజైన  పోస్టర్స్ తెగ ట్రెండింగ్ లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జులై 28న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.కాగా ఈ సినిమాను పిపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్  సంగీతం అందిస్తుండగా..కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.