కొనసాగుతున్న ప్రధాని మోడీ రోడ్ షో

కొనసాగుతున్న ప్రధాని మోడీ రోడ్ షో

కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి మరి కొన్ని గంటలే మిగిలున్న వేళ ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ లు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఆయా పార్టీల అగ్రనేతలు స్పీడ్ పెంచారు.  బెంగళూరులో ప్రధాని మోడీ భారీ రోడ్ షో ఇవాళ్ల కొనసాగుతోంది. మొదటి రోజు రోడ్ షో 13 నియోజకవర్గాలను కవర్ చేసింది. రెండో రోజు తిప్పసంద్రలోని కెంపేగౌడ విగ్రహం నుంచి ట్రినిటీ సర్కిల్ వరకు 10 కి.మీ. మేర రోడ్ షో జరిగింది.

అనంతరం పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మోడీ ప్రసంగించన్నున్నారు. ప్రధానిని చూడటానికి రోడ్డుకిరువైపులా జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ నెల 10 న కర్ణాటక అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. 13 న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.