పోక్సో కేసులో ఒంగోలు స్పెషల్ కోర్టు నింధితునికి 20ఏళ్లు జైలు శిక్ష

పోక్సో కేసులో ఒంగోలు స్పెషల్ కోర్టు నింధితునికి 20ఏళ్లు జైలు శిక్ష

మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు కోర్టు ఓ వ్యక్తికి 20ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధించింది. ఒంగోలులోని పోక్సో స్పెషల్ కోర్టు బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చినగంజాం మండలం సంతరావురు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన దుడ్డు చిన్నబ్బాయి(57) అదే గ్రామానికి చెందిన ఆరేళ్ల మైనర్ బాలికపై 2018 మార్చి 20న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

2018 మార్చి 22న దీనిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. చినగంజాం పోలీసులు ఐపిసి సెక్షన్ 376, పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద కేసు నమోదు చేశారు. అప్పటి చీరాల సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి (ఎస్‌డిపిఒ) వి.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి చార్జిషీటు వేశారు. ఒంగోలు ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి టి.రాజా వెంకటాద్రి ఈ నేరంలో నిందితులను దోషులుగా నిర్ధారించి నవంబర్ 20న తీర్పు వెలువరించారు.