నాలుగు నెలలుగా జీతాలు ఇస్తలేరు

  •      ఫారెస్ట్ ఆఫీస్ ముందు వాచర్ల ధర్నా

కాగజ్ నగర్, వెలుగు : నాలుగు నెలలుగా జీతాలు రావడంలేదంటూ ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది మంగళవారం కాగజ్​నగర్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. డివిజన్ వ్యాప్తంగా ఔట్ సోర్సింగ్​లో పనిచే
స్తున్న వాచర్లు, డ్రైవర్లు, ఆపరేటర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

ALSO READ :జయధీర్ తిరుమలరావుకు రాష్ట్రపతి అభినందన

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారులు తమను పట్టించుకోవడంలేదని, నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుంటే కుటుంబాలను ఎలా పోషించాలని ప్రశ్నించారు. వెంటనే పెండింగ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆఫీస్ సూపరిండెంటెంట్ విలాస్ రావ్​కు వినతి పత్రం అందజేశారు.