వనపర్తి, వెలుగు : వనపర్తి శివారులోని నాగవరం వద్ద ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ గురుకులానికి ఓనర్ తాళం వేశాడు. అద్దె భవనంలో నడుస్తున్న గురుకులం యాజమాన్యానికి 8 నెలలుగా అద్దె చెల్లించడం లేదు. దీంతో అసహసనానికి గురైన భవనం యాజమాని సోమవారం గురుకులానికి తాళం వేసి లెక్చరర్లను గేట్ బయటే ఉంచాడు. దాదాపు 3 గంటల పాటు స్టూడెంట్లు లోపల, లెక్చరర్లు బయట ఉండిపోయారు.
చివరకు ఉన్నతాధికారులు సర్ది చెప్పడంతో యాజమాని తాళం తీశాడు. దీంతోపాటు జిల్లాలోని రెండు బీసీ, మూడు ఎస్సీ, మూడు ఎస్టీ గురుకులాలు కూడా కిరాయి బిల్డింగుల్లోనే నడుస్తున్నాయి. ప్రతి బిల్డింగ్కు ఆరేడు నెలలుగా కిరాయి చెల్లించడం లేదు. నెలల తరబడి కిరాయి రాకపోవడంతో ఓనర్లు అసహనానికి లోనవుతున్నారు.