భూవివాదంలో యజమానిపై దాడికి పాల్పడ్డ నిందితుల్ని స్థానికులు చెట్టుకు కట్టేసిన ఘటన కరీంనగర్ లో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మానకొండూరు మండలం చెంజర్లలో సంఘమిత్ర సీడ్ ప్లాంట్యజమాని గురజాల జయరామయ్యను భూవివాదంలో ఓ ముగ్గురు బెదిరించి దాడి చేశారు.
ఆయనపై దాడి చేస్తున్న విషయాన్ని గుర్తించిన స్థానికులు దాడిని అడ్డుకుని ముగ్గురిని బంధించి చెట్టుకు కట్టేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.
జయరామయ్య కొనుగోలు చేసిన భూమి చుట్టూ ప్రహరీ నిర్మిస్తుండగా ఆ స్థలం తమదేనంటూ తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట గ్రామానికి చెందిన రాజు గౌడ్, కరుణాకర్, దివాకర్ లు అడ్డుపడ్డారు.