ఇయ్యాల ఢిల్లీలో పద్మ అవార్డుల ప్రదానం

  • రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న కిన్నెర మొగిలయ్య

న్యూఢిల్లీ, వెలుగు: 73వ రిపబ్లిక్ డేను పురస్కరించుకొని జనవరి 25న కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం ఢిల్లీలో జరగనుంది. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌‌ హాల్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా కిన్నెర మొగిలయ్య పద్మశ్రీ అవార్డు అందుకోనున్నారు. తెలంగాణ నుంచి భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల దంపతులకు జంటగా పద్మ భూషణ్‌, ఆర్ట్స్‌ విభాగంలో కిన్నెర మొగిలయ్య, పద్మజా రెడ్డి, రామ చంద్రయ్యలను పద్మశ్రీలు వరించాయి. మొత్తం 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా, సోమవారం కొద్ది మందికి మాత్రమే అవార్డులు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.