నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘దసరా’ తర్వాతి చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ‘ప్యారడైజ్’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు మేకర్స్.
ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్టు అనౌన్స్ చేశారు. జెర్సీ, గ్యాంగ్‌లీడర్ హిట్స్ తర్వాత నాని, అనిరుధ్ కలిసి పనిచేస్తున్న మూడవ చిత్రం ఇది. ‘వెల్‌కమ్ అనిరుధ్..’ అంటూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాని.. తాము హ్యాట్రిక్ కోసం రెడీ అవుతున్నాం అని ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నాని కూడా తన పాత్ర కోసం సిద్ధం కావడానికి ఇంటెన్స్‌గా జిమ్ చేస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ నాని ‘హిట్3’ చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్నాడు.